తెలంగాణ

telangana

ETV Bharat / state

భేష్​... ఓజస్​..! - STARTUP

అంకుర సంస్థలకు చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వైద్య రంగానికి కృషి చేస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరినీ ఒక్కచోట చేరుస్తోంది. ఓజస్​ మెడ్​టెక్​ బయోనెస్ట్​ కేంద్రంగా మెరుగైన అవకాశాలు  కల్పిస్తోంది.

వైద్య రంగంలో అంకురాలకు చేయూత

By

Published : Feb 28, 2019, 6:31 AM IST

Updated : Feb 28, 2019, 7:41 AM IST

వైద్య రంగంలో అంకురాలకు చేయూత

వైద్య రంగ పరికరాల ఉత్పత్తుల కోసం కృషి చేస్తున్న అంకుర సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.పారిశ్రామికవేత్తలను ఒక్కచోట చేర్చేందుకు రూపొందిన ఓజస్ మెడ్ టెక్ బయో నెస్ట్​ని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. హైదరాబాద్ త్రిపుల్ ఐటీలో ఇంక్యుబేటర్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం, బీఐఆర్ ఏసీ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.

మరో కలికితురాయి...

మందులు, వ్యాక్సిన్ల తయారీలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు ఓజస్ మెడ్ టెక్ బయో నెస్ట్ మరో కలికితురాయి వంటిదని జయేష్ రంజన్ పేర్కొన్నారు.ప్రారంభించిన రోజే దాదాపు ఎనిమిది అంకుర సంస్థలు బయోనెస్ట్​లో తమ ఉత్పత్తులు ప్రదర్శించి ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి:ఆదిత్య కిరణం... ఆరోగ్యం పదిలం...

Last Updated : Feb 28, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details