తెలంగాణ

telangana

ETV Bharat / state

Officials Denied Permission to Congress Meeting : కాంగ్రెస్​కు మళ్లీ ఎదురుదెబ్బ.. తుక్కుగూడలో సభాస్థలి నిర్వహణకు అనుమతి నిరాకరణ - సీడబ్ల్యుసీ మీటింగ్ అప్డెట్స్

Officials Denied Permission to Congress Meeting : ఈ నెల 17 న కాంగ్రెస్​ పార్టీ నిర్వహించబోయే జయభేరీ.. తుక్కుగూడ సభాస్థలి నిర్వహణకు అధికారులు అనుమతి నిరాకరించారు. సంబంధిత స్థలం దేవాదాయశాఖ భూమి అయినందున రాజకీయ సభలకు అనుమతి ఇవ్వలేమని దేవాదాయశాఖ కమిషనర్​ అనిల్​కుమార్​ స్పష్టం చేశారు.

CWC Meeting Update
Officials Denied Permission to Congress Meeting

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2023, 10:37 PM IST

Officials Denied Permission to Tukkuguda Meeting :కాంగ్రెస్​ పార్టీ(Congress Party) జయభేరీ సభ.. ఏర్పాటుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా తుక్కుగూడలో తలపెట్టిన బహిరంగసభ ఏర్పాటుకు దేవాదాయ శాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. సభ నిర్వహించే స్థలం.. దేవాదాయశాఖకు చెందిన భూమి కావడం వల్ల రాజకీయ సభలకు అనుమతి ఇవ్వలేమని దేవాదాయశాఖ కమిషనర్​ అనిల్​కుమార్​ పేర్కొన్నారు.

KC Venugopal on Telangana Assembly Elections 2023 : 'ఈసారి అధికారంలోకి రాబోతున్నాం.. సమన్వయంతో పని చేయండి'

సెప్టెంబర్​ 17న కాంగ్రెస్​ పార్టీ నిర్వహించబోయే జయభేరి సభ.. తెలంగాణలో రాబోయే ఎన్నికల దృష్ట్యా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సభ ముందు రోజు సెప్టెంబర్​ 16న హోటల్​ తాజాకృష్ణలో కాంగ్రెస్​ ఉన్నత స్థాయి సమావేశాలు.. సీడబ్ల్యుసీ(CWC Meetings) మీటింగ్​లు జరగనున్నాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ ​గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర రాష్ట్రాల పీసీసీ నేతలు, సీఎల్పీ నేతలు పాల్గొననున్నారు.

CWC Meeting Update :తెలంగాణ విమోచన దినోత్సవం రోజున జయభేరి సభను.. పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించేందుకు కాంగ్రెస్​నేతలు అధికారులకు​ దరఖాస్తు చేసుకున్నారు. అదే రోజు ఇతర రాజకీయపార్టీల సభలు ఉండటంతో.. సభ ఏర్పాటుకు అధికారులు అనుమతి నిరాకరించారు. తాజాగా తుక్కుగూడ వద్ద యాభై ఎకరాలకుపైగా భూమిలో సభ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌ దరఖాస్తు చేయగా.. అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పక్కనే ప్రైవేట్​ స్థలం ఉండడంతో అక్కడ సంబంధిత భూయజమానులతో అనుమతి తీసుకుని, సభ నిర్వహణకు అనుమతి కోసం ప్రయత్నం చేస్తున్నారు.

Congress Left Parties Alliance Telangana : వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు చిక్కు.. సీట్ల విషయంలో తేలని లెక్క

Jayabheri Meeting Latest News :ఈ నెల 16, 17న నిర్వహించబోయే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ- సీడబ్ల్యుసీ సమావేశాలకు, జయభేరి బహిరంగసభకు పటిష్ఠ భద్రత కల్పించాలని డీజీపీ అంజనీకుమార్‌ను కోరినట్లుపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు అంజన్‌కుమార్‌ యాదవ్‌, సిరిసిల్ల రాజయ్య, మాజీ పీసీసీ చీఫ్​ వీహెచ్​, నరేంద్ర రెడ్డిలతో కలిసి వినతిపత్రం అందించారు.

Congress Latest News :పరేడ్ గ్రౌండ్​లో సభ పెట్టుకోవాలని దరఖాస్తు చేసుకుంటే.. దానిని కాంగ్రెస్‌కు ఇవ్వకుండా బీజేపీ(BJP), బీఆర్​ఎస్​ కుట్ర చేశాయని రేవంత్​రెడ్డి ఆరోపించారు. తాము నిర్వహించబోతున్న కార్యక్రమాలకు ఏలాంటి ఆటంకాలు కలిగించకుండా..కేసీఆర్(KCR) రాజకీయ విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. 17వ తేదీన ఇతరత్రా కార్యక్రమాలు ఏర్పాటు లేకుండా చూడాలన్నారు.

అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌లు రెండు కూడా విజయభేరి సభకు ఆటంకం కలిగించే ప్రయత్నం సరియైన చర్య కాదని పేర్కొన్నారు. కనీవినీ ఎరుగని విధంగా విజయభేరి సభను నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. చేరికలు, పొత్తుల అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

Congress Party joinings in Telangana : కాంగ్రెస్​లో ప్రముఖ నాయకుల చేరికకు ముహూర్తం ఖరారు

Revanth Reddy Fire on BJP : 'బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నాయి'

ABOUT THE AUTHOR

...view details