పోలీస్ అకాడమీలో ఉన్న శిక్షణ ఐపీఎస్‌లకు సైబర్, ఆర్థిక నేరాలు, జాతీయ భద్రత, తీవ్రవాద సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగేలా శిక్షణ ఇస్తామని అకాడమీ సంచాలకులు అభయ్ తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో 31వ సంచాలకునిగా అభయ్ బాధ్యతలు చేపట్టారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పోలీస్ అకాడమీ సంచాలకునిగా అభయ్ బాధ్యతల స్వీకరణ - జాతీయ పోలీస్ అకాడమీ
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ సంచాలకునిగా ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి అభయ్ బాధ్యతలు స్వీకరించారు. సైబర్, ఆర్థిక నేరాలు జాతీయ భద్రతపై శిక్షణ ఐపీఎస్‌లకు పూర్తి అవగాహన కలిగిస్తామని తెలిపారు.
పోలీస్ అకాడమీ సంచాలకునిగా అభయ్ బాధ్యతల స్వీకరణ
అభయ్ 1986 బ్యాచ్‌కు చెందిన ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి. స్వరాష్ట్రం ఒడిశాతో పాటు సీబీఐ, సీఆర్పీఎఫ్, నార్కోటిక్ కంట్రోల్ బోర్డుల్లో విధులు నిర్వర్తించారు. అభయ్ సేవలను గుర్తించిన ప్రభుత్వం జాతీయ పోలీస్, రాష్ట్రపతి మెడల్‌తో సత్కరించింది.
ఇవీ చూడండి: "ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి"