నూజివీడులో బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తన తండ్రి కోసం ఇంటి సమీపంలోని రోడ్డుపై నిలుచున్న మూడో తరగతి బాలికను ఆగంతుకుడు సైకిల్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిసింది. అనంతరం ఘటనా స్థలంలోనే బాలికను వదిలేసి పరారయ్యాడు.
బాలికపై అత్యాచారం కేసులో పోలీసుల అదుపులో నిందితుడు..! - నూజివీడులో బాలికపై అత్యాచారం
కృష్ణా జిల్లా నూజివీడులో మూడో తరగతి బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. గాంధీనగర్‌కు చెందిన ఓ ఆటోడ్రైవర్ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అన్ని ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నట్లు సమాచారం.
బాలికపై అత్యాచారం కేసులో పోలీసుల అదుపులో నిందితుడు..!
భరించలేని బాధతో బాలిక వేసిన కేకలు విన్న పెట్రోలింగ్ పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి..ఏకాంత చిత్రాలు.. వీడియోలతో మాజీ భర్త వేధింపులు
TAGGED:
నూజివీడులో బాలికపై అత్యాచారం