తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రుల్లో నర్సుల గోస

అన్ని వేళలా రోగులకు అండగా ఉండే నర్సులకు గుత్తేదారులు మొండి చేయి చూపిస్తున్నారు. ఏళ్ల తరబడి సేవలు చేసినా.. తమ కష్టాలు తీరట్లేదని వాపోతున్నారు. జీతాలు ఇవ్వాలని ధర్నాకు దిగారు.

జీతాలియ్యుండ్రి సారూ...!

By

Published : Feb 8, 2019, 1:29 PM IST

Updated : Feb 8, 2019, 7:45 PM IST

గాంధీ, నిలోఫర్​ ఆస్పత్రుల్లో పొరుగు సేవల నర్సుల ఆందోళన రెండోరోజుకు చేరింది. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదని నిరసన బాట పట్టారు. 12 ఏళ్లుగా ఆసుపత్రిలో పొరుగు సేవల అందిస్తున్నా..ఏ ఒక్క నెలలోనూ సరైన సమయానికి జీతాలు ఇవ్వలేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలుగా వేతనాలు లేక కనీస అవసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోడు వెల్లబోసుకుంటున్నారు.
నర్సుల ఆందోళనకు కార్మిక సంఘాల నాయకలు మద్దతు ప్రకటించారు. వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Last Updated : Feb 8, 2019, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details