ఫిబ్రవరి 28 వరకు నుమాయిష్ ప్రదర్శన - nampally
రేపట్నుంచే ప్రదర్శన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. దుకాణదారుల డిమాండ్లన్నీ పరిష్కరిస్తామన్నారు.
noomaish
నాంపల్లి ఎగ్జిబిషన్ పాలకవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు తెలిపారు. స్టాళ్ల నిర్వాహకులతో చర్చించి వారి డిమాండ్ల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దుకాణదారులు చెల్లించిన 35వేల రిజిస్ట్రేషన్ రుసుమును తిరిగి ఇచ్చేస్తామన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ. 25వేలు చెక్కురూపేణా ఇస్తామని పేర్కొన్నారు. రేపట్నుంచే ప్రదర్శన పున ప్రారంభిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
noomaish