Numaish Exhibition 2024 Hyderabad :హైదరాబాద్ నాంపల్లిలో ప్రతి ఏటా ఏర్పాటు చేసే నుమాయిష్ ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. 1938లో స్థానిక ఉత్పత్తులతో పాటు, చేతివృత్తులను ప్రదర్శించడానికి ఒక ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University) గ్రాడ్యుయేట్ల బృందం ఆలోచన చేసి నుమాయిష్‌గా అందుబాటులోకి తీసుకొచ్చాయి.
హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali khan) పాలనలో నుమాయిష్ ప్రదర్శనను కొనసాగించారు. పబ్లిక్ గార్డెన్స్‌లో 1938లో ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ప్రారంభంలో 100 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. తదనంతరం స్టాళ్ల సంఖ్య పెరగడంతో నుమాయిష్ నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మార్చారు. దీనికి ప్రధాన కారణం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉండాలని నిర్వాహకులు భావించారు.
Numaish Exhibition in Nampally : ప్రారంభంలో ఎగ్జిబిషన్ పేరు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా పిలుచుకునేవారు. 2009లో దాన్ని నుమాయిష్‌గా మార్చారు. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే నుమాయిష్‌కు రెండు సార్లు అటంకం కలిగింది. ప్రపంచ దేశాల్లో మరణ మృదంగం మోగించిన కోవిడ్(Covid-19) మహమ్మారి కారణంగా 2021-22 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం కోవిడ్‌ను అరికట్టడంలో భాగంగా ఎగ్జిబిషన్‌ను రద్దు చేసింది.
అనంతం కరోన వైరస్ తగ్గడంతో ఎగ్జిబిషన్ సోసైటీ తిరిగి నుమాయిష్ ప్రారంభించింది. ఈ ఎడాది 83వ ఎగ్జిబిషన్ జనవరి 1వ తేదీన ప్రారంభమైంది. 46 రోజులు పాటు నుమాయిష్‌ను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏడాది కోసారి జరిగే ఎగ్జిబిషన్‌కు ప్రజల నుంచి మంచి అనూహ్య స్పందన వస్తుంది.