Protest: కాలనీలో డంపింగ్ యార్డ్ నిర్మించొద్దు - telangana news updates
హైదరాబాద్ కూకట్పల్లి సర్కిల్ ఎన్టీఆర్ నగర్ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ నిర్మించవద్దని డిమాండ్ చేశారు.
protest
తమ కాలనీలో డంపింగ్ యార్డు సెంటర్ నిర్మించవద్దని పక్కనున్న నిర్వాసితులకు ఇబ్బంది కలుగుతుందని కూకట్పల్లి సర్కిల్ అల్విన్ కాలనీ డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. డంబింగ్ స్టోరేజ్, రీసైక్లింగ్ పనుల నిమిత్తం ఇక్కడ షెడ్డు నిర్మాణం చేస్తే.. వ్యర్థలతో వచ్చే వాసనలకు కాలనీ వాసులు అనారోగ్యపాలవుతారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ నిర్మించవద్దని డిమాండ్ చేశారు.