రాష్ట్రంలోని పెట్రోల్ బంకు యాజమాన్యాలు అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్నాయని ప్రజల నుంచి పౌరసరఫరాలశాఖ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిర్దేశిత కొలతల మేరకు కాకుండా తక్కువగా పోయటం సహా కల్తీలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పౌరసరఫరాల శాఖ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పౌరసరఫరాల శాఖ, తూనికల కొలతల శాఖ, ఆయిల్ కంపెనీల ఆధ్వర్యంలో అధికారులు ఉమ్మడిగా విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో మెుత్తం 2553 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ నెల1 నుంచి 21 వరకు 638 బంకుల్లో తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లఘింస్తున్న 183 పెట్రోలు బంకుల యాజమాన్యాలకు క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు జారీ చేశారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 24, కరీంనగర్ 20, కామారెడ్డి 20, సిద్దిపేట జిల్లాల్లో 14 పెట్రోలు బంకులు అత్యధికంగా ఉన్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న 183 బంకులకు నోటీసులు - తూనికల కొలతల శాఖ
రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ప్రజల నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన ఆశాఖ ఈనెల 1నుంచి 21 వరకు 638 బంకుల్లో వివిధ శాఖల అధికారుల సహాయంతో తనిఖీలు చేసి నిబంధనలు అతిక్రమిస్తున్న 183 బంకు యాజమాన్యాలకు నోటీసులు అందజేశారు.
Notices for 183 bunkers that violate the regulations