రాష్ట్రంలో కల్వకుంట్ల వారి ప్రభుత్వం నడుస్తోందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. 2018లో భాజపా119 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాల్లో కూడా డిపాజిట్లు రాలేదని ఎద్దేవా చేశారు. వేరే పార్టీల వాళ్లు అంటరాని వాళ్లు అనే భావన తమకు లేదన్నారు. గతంలో ఏ ప్రభుత్వమన్నా రూ.20 లక్షల ఉపకార వేతనంతో విదేశాలకు పంపారా అని ప్రశ్నించారు. అప్పులు చేశారని విమర్శిస్తున్నారు... ఎవరి కోసం అప్పు చేశాం.. సంక్షేమం కోసమే కాదా అని అన్నారు.
భాజపాకు డిపాజిట్లు కూడా దక్కలేదు: తలసాని - ministers
అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 119 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాల్లో కూడా డిపాజిట్లు దక్కలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. వేరే పార్టీల వాళ్లు అంటరాని వాళ్లు అనే భావన తమకు లేదని అన్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్