తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2022, 12:27 PM IST

ETV Bharat / state

కనుమ సందడి.. కిటకిటలాడిన మాంసం దుకాణాలు.. కనిపించని భౌతికదూరం

Rush at Non Veg Market: ఆదివారం వచ్చిందంటే చాలు వైన్‌ షాపుల ముందు మందుబాబుల హవా మనకు తెలిసిందే. ఇక మాంస ప్రియులకైతే ముక్క లేనిదే ముద్ద దిగదు. పండుగ సందర్భాల్లోనూ ఇది సహజమే. కానీ ఈసారి కనుమ, ఆదివారం ఒకే రోజు రావడంతో నాన్‌వెజ్‌ దుకాణాల ఎదుట జనం బారులు తీరారు. అక్కడ రద్దీ చూస్తుంటే ఇది మద్యం దుకాణమా అన్న సందేహం రాక మానదు. కొవిడ్‌ నిబంధనలు మరిచి మరీ తమ వంతు కోసం ఎదురు చూశారు.

Rush at Non Veg Market
నాన్‌వెజ్‌ దుకాణాల వద్ద రద్దీ

Rush at Non Veg Market: సంక్రాంతి సందర్భంగా నిన్నటివరకూ పిండివంటలు, ప్రసాదాలతో పండుగ చేసుకున్న ప్రజలు.. కనుమ రోజున నాన్‌వెజ్‌ రుచులు చూసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని మాంసం దుకాణాల వద్ద జనం బారులు తీరారు. మటన్‌, చికెన్‌, చేపలు కొనేందుకు ఉదయమే వచ్చి.... వరుసల్లో నిలబడ్డారు. పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లోని దుకాణాల వద్ద రద్దీ కనిపించింది.

కనుమ, ఆదివారం కలిసిరావడంతో ప్రజలు మాంసం కొనేందుకు భారీగా తరలివచ్చారు. మటన్‌, చికెన్‌, చేపలు కొనుగోలు చేసి.. ఇంటికి తీసుకెళ్లారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో... మాంసం దుకాణాల వద్ద ఎక్కడా భౌతికదూరం కనిపించలేదు.

ముక్క కోసం మాంసం దుకాణాల వద్ద బారులు.. కనిపించని భౌతికదూరం

ఇదీ చదవండి:Inavolu Jatara in Telangana: తెలంగాణలో జాతర సందడి.. తరలివచ్చిన భక్తజన సందోహం

ABOUT THE AUTHOR

...view details