విచారణకు హాజరు కానందుకు ముగ్గురు కాంగ్రెస్ నేతలపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హనుమకొండలో అనుమతి లేకుండా 2018లో ప్రదర్శన నిర్వహించారంటూ నమోదైన కేసు విచారణ గురువారం జరిగింది. ఇవాళ్టి విచారణకు కేంద్ర మాజీ మంత్రి పి.బలరాం నాయక్, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరయ్యారు. మరోవైపు కేసును త్వరగా విచారణ జరిపి తేల్చాలని.. అవసరమైతే గైర్హాజరైన వారిపై ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయరామారావు కోరారు. విచారణకు సహకరించడం లేదంటూ బలరాం నాయక్, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిని వెంటనే అరెస్టు చేసి హాజరుపరచాలని హనుమకొండ పోలీసులను కోర్టు ఆదేశించింది.
NBW:ముగ్గురు కాంగ్రెస్ నేతలపై నాన్ బెయిలబుల్ వారెంట్ - telangana varthalu
18:47 August 26
ముగ్గురు కాంగ్రెస్ నేతలపై నాన్ బెయిలబుల్ వారెంట్
ఎన్బీడబ్ల్యూ జారీ అయిన కొద్దిసేపటికే బలరాం నాయక్ కోర్టుకు హాజరై.. వారెంట్ ఉపసంహరించాలని కోరారు. అంగీకరించిన న్యాయస్థానం బలరాం నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఉపసంహరించింది. కేసు విచారణ సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది.
అక్బరుద్దీన్‌పై కేసు.. మూడున విచారణ.
నిర్మల్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై నమోదైన కేసు హైదరాబాద్ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయింది. కేసు విచారణ కోసం సెప్టెంబర్ 3న హాజరు కావాలని అక్బరుద్దీన్‌ను కోర్టు ఆదేశించింది.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలపై బూర్గం పహాడ్‌లో ఎమ్మెల్యే రేగా కాంతారావు, అశ్వరావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై నమోదైన రెండు కేసులను ఎంపీ ఎమ్మెల్యేల కోర్టు కొట్టివేసింది. ఇవాళ వేర్వేరు కేసుల్లో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, జాఫర్ హుస్సేన్ కోర్టుకు హాజరయ్యారు.
ఇదీ చదవండి: RS PRAVEEN KUMAR: 'తెలంగాణ అసెంబ్లీని రేపే రద్దు చేసినా ఆశ్చర్యం లేదు'