ARVIND COMMENTS ON CM KCR: తెలంగాణ ప్రథమ పౌరురాలైన గవర్నర్‌ను కేసీఆర్ చిన్నచూపు చూపిస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆక్షేపించారు. తెరాస అధికారంలోకి వచ్చిన తొలిసారి మంత్రివర్గంలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరునెలల పాటు మంత్రివర్గ విస్తరణ చేయలేదని పేర్కొన్నారు. బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి బడ్జెట్ సమావేశాల ముందే క్యాబినెట్‌ను విస్తరించారని తెలిపారు.
చట్ట సభల నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఆర్టికల్ 176 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకావాలని గుర్తు చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నారు.