తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజలకు ఏం కావాలో మోదీకి తెలుసు: అర్వింద్​ - కేసీఆర్​పై ఎంపీ అర్వింద్​ విమర్శలు

ప్రజలకు ఏం కావాలో.. ఒక కింది స్థాయి నుంచి వచ్చిన నేతగా నరేంద్ర మోదీకి తెలుసని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ అన్నారు. ఇలాంటి విపత్తు సమయాల్లో ప్రజలకు ఏం కావాలో.. అది నేరుగా ప్రజలకు అందేలా చరిత్రలో లేనటువంటి బ్రహ్మాండమైన ప్యాకేజీ ఆయన రూపొందించారు అభిప్రాయపడ్డారు.

ప్రజలకు ఏం కావాలో మోదీకి తెలుసు: అర్వింద్​
ప్రజలకు ఏం కావాలో మోదీకి తెలుసు: అర్వింద్​

By

Published : May 20, 2020, 5:38 PM IST

హైదరాబాద్​ కాచిగూడ డివిజన్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్, ఆయన సతీమణి ప్రియాంక.. 200 మంది పేదలు, మున్సిపల్​ కార్మికులు, పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాలు అందించారు. ఈ కార్యక్రమం అర్వింద్​ బంధువులైన ఆది వేణుగోపాల్ సునీత దంపతుల జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది.

"ప్రజలకు ఏం కావాలో కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా నరేంద్ర మోదీకి తెలుసు. గతంలో ఎన్నో విపత్తులను చూసిన ప్రధాని ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలకు ఏం కావాలో నేరుగా అది ప్రజలకు అందే విధంగా బ్రహ్మాండమైన ప్యాకేజీని రూపొందించారు. దానిపై కూడా కేసీఆర్​ శవ రాజకీయాలు చేస్తున్నారు."

-అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ

ప్రజలకు ఏం కావాలో మోదీకి తెలుసు: అర్వింద్​

ఇదీ చూడండి:కరోనా రికార్డ్​: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు

ABOUT THE AUTHOR

...view details