ప్రగతి భవన్ వద్ద ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ 52 మంది అంకాపూర్ ప్రజలు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వచ్చారు. ముందస్తు అనుమతిలేదంటూ లేదంటూ పోలీసులు వారిని అడ్డుకుని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. తమకు ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేస్తామని గతంలో హామీ ఇచ్చారని, ఆ ప్రకారంగా ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా అమలుచేయలేదని, అందుకే సీఎంను కలిసి గుర్తు చేద్దామని వచ్చినట్లు వారు వివరించారు.
ప్రగతి భవన్ వద్ద అంకాపూర్ ప్రజల అరెస్ట్ - nizamabad
ప్రగతి భవన్ వద్ద ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు వచ్చిన వారిని...ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Pragati Bhawan