రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు యువతి, యువకులకు ఉపాధి కల్పనలో పభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా.. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తెరాస పార్టీకి బుద్ది చెప్పాలని అఖిల భారత విద్యార్థి, యువజన నిరుద్యోగ జేఏసీ జాతీయ ఛైర్మన్ సగరపు ప్రసాద్ అన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల ఆత్మ గౌరవాన్ని చాటేందుకు ఇది ఒక మంచి అవకాశం అన్నారు. భాజపా అభ్యర్థి రవినాయక్‌ను గెలిపించాలని కోరుతూ గోడపత్రికను ఆవిష్కరించారు.
సాగర్ ఉపఎన్నికల్లో తెరాసకు బుద్ధి చెప్పాలి: సగరపు ప్రసాద్ - telangana news
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తెరాసకు బుద్ధి చెప్పాలని అఖిల భారత విద్యార్థి, యువజన నిరుద్యోగ జేఏసీ జాతీయ ఛైర్మన్ సగరపు ప్రసాద్ అన్నారు. భాజపా అభ్యర్థిని గెలిపించాలని సాగర్ ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
సాగర్ ఉపఎన్నికల్లో తెరాసకు బుద్ధి చెప్పాలి: సగరపు ప్రసాద్
తెలంగాణ ఉద్యమంలో హీరోలుగా ఉన్న నిరుద్యోగులు... రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీరోలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాసను ఓడిస్తేనే రెండు పడక గదుల ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు వస్తాయన్నారు. నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని... సునీల్ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: భగత్ తరఫున ప్రచారం చేసిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి