Niranjan Reddy Fires on Opposition Parties : పాలమూరుకు నీళ్లొస్తే తమ రాజకీయ జీవితాలు శాశ్వతంగా ఎక్కడ కూలిపోతాయోనని విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Singireddy Niranjan Reddy) అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయంటూ మంత్రి ఘాటుగా స్పందించారు.
Niranjan Reddy on Congress Leaders Comments :ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు కింద ఆయకట్టు సహా బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టుతో పాటు తాగు నీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఇది గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 216 టీఎంసీల సామర్ధ్యం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు నీటిని తోడుకోవడానికి నిర్ణయించుకున్నామని చెప్పారు. విపక్షాలు ముందు జూరాల నుంచి మొదలుపెట్టాలని వాదించారు.. తర్వాత అటవీ ప్రాంతమని ఫిర్యాదులు చేశారని ఆక్షేపించారు. ఆ తర్వాత పర్యావరణం దెబ్బతింటుందని గ్రీన్ ట్రిబ్యునన్‌లో ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు.
Niranjan Reddy Reaction on Palamuru Project : రైతుల పేరిట వివిధ రూపాల్లో కేసులు వేయించారని విమర్శించారు. అన్ని రకాల విఘ్నాలు దాటుకుని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru- Rangareddy Project)లో మొదటి పంపు ప్రారంభించగానే ఇప్పుడు ఒక పంపుతో ఎలా మొదలు పెడతారని కొత్త రాగం ఎత్తుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూరాల ప్రాజెక్టు పరిధిలో ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకింద 32 గ్రామాలు, 85 వేల ఎకరాల సేకరణ ఉందని, రీ డిజైన్ చేసిన ఈ ఎత్తిపోతల పథకంలో కేవలం 27 వేల ఎకరాల భూసేకరణ, 3 పెద్ద గ్రామాలు, 8 చిన్న తండాలు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనంపై సీఎం కేసీఅర్ దృష్టి పెట్టారన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ పనులు ఆగవు.. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అని హితవు పలికారు.
Niranjan Reddy on Palamuru Rangareddy Project : పాలమూరుకు తీరనున్న కష్టాలు.. త్వరలోనే సాగునీళ్లు