తెలంగాణ

telangana

ETV Bharat / state

బండారి మద్దిలేటి వ్యవహారాలపై ఎన్​ఐఏ ఆరా

మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధాలున్నాయన్న నెపంతో తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటిపై ఎన్​ఐఏ ఆరా తీస్తోంది. గతేడాది హైదరాబాద్​ పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు, తెవివే నిధులకు సంబంధించి వివరాలు సేకరిస్తోంది.

nia raids on bandari maddileti
బండారి మద్దిలేటి వ్యవహారాలపై ఎన్​ఐఏ ఆరా

By

Published : Feb 4, 2020, 11:18 AM IST

తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు బండారి మద్దిలేటి వ్యవహారాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు పెంచేందుకు, యువతను మావోయిస్టులుగా మార్చేందుకు తెలంగాణ విద్యార్థి వేదిక పనిచేస్తోందన్న అభియోగాలపై గతేడాది అక్టోబర్​లో హైదరాబాద్ పోలీసులు బండారి మద్దిలేటిపై కేసు నమోదు చేశారు. మద్దిలేటి, డాక్టర్ జగన్​లు మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న సమాచారంతో వారి ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ప్రైవేట్, కార్పోరేట్ విద్యా సంస్థలను బెదిరించేందుకు మావోయిస్టుల పేరిట రాసి ఉన్న లేఖలు, సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.

మద్దిలేటికి తెవివే సభ్యులు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు సమగ్ర దర్యాప్తు కోసం... పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక పరిశోధనా బృందానికి అప్పగించారు. తెలంగాణ విద్యార్థి వేదికపై కొనసాగుతున్న కేసుల వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ సేకరిస్తోంది. హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన ఆధారాలను రాష్ట్ర పోలీసుల నుంచి సేకరిస్తున్నారు. తెలంగాణ విద్యార్థి వేదికకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయనే అంశంపై ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:'కరోనా'.. పాముల ద్వారా కాదు గబ్బిలాల వల్లేవ్యాప్తి!

ABOUT THE AUTHOR

...view details