తెలంగాణ

telangana

ETV Bharat / state

NHM: తమ సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రికి వినతిపత్రం - తెలంగాణ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో ఎన్​హెచ్ఎం చేర్చకపోవడంపై పలువురు ఉద్యోగులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. తమ పీఆర్సీ రెగ్యులరైజేషన్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే ఎన్​హెచ్ఎం జీతాల విషయంలో.. ప్రభుత్వం దృష్టి సారించకపోవడం విచారకరమని వినతి పత్రంలో పేర్కొన్నారు.

తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్​హెచ్ఎం ఉద్యోగుల వినతిపత్రం
NHM employees hand over petition to Union Home Minister Kishan Reddy to resolve PRC regularization issues for NHM employees in hyderabad

By

Published : Jun 28, 2021, 3:31 PM IST

ఎన్​హెచ్ఎం ఉద్యోగులకు పీఆర్సీ రెగ్యులరైజేషన్ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఎన్​హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) ఉద్యోగులు విన్నవించారు. హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో ఆయనకు పలువురు ఎన్​హెచ్ఎం ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు.

ఈనెల 11న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు పెంచుతున్నట్లు జీవోలు కూడా విడుదల చేశారన్నారు. కానీ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే ఎన్​హెచ్ఎం జీతాల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించకపోవడం విచారకరమని వినతి పత్రంలో పేర్కొన్నారు.

నేషనల్ హెల్త్ మిషన్.. కేంద్ర ప్రభుత్వ పథకం అనే పేరుతో.. తమకు గత పీఆర్సీలలో కూడా వేతనాలు పెంచకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్​హెచ్ఎం స్కీమ్​లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని వారు ఆరోపించారు. తమకు పీఆర్సీ వర్తింపజేసే విధంగా.. పీఆర్సీ కమిషన్ సూచించిన రెగ్యులర్ ఉద్యోగి బేసిక్​ పేను, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనంతో ఇచ్చే విధంగా కృషి చేయాలని వినతిపత్రంలో కోరారు. ఎన్​హెచ్ఎం ఉద్యోగుల సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఇదీ చూడండి:బీటా వేరియంట్​పై వ్యాక్సిన్లు ప్రభావవంతమేనా?

ABOUT THE AUTHOR

...view details