తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రెస్​క్లబ్​లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు - ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్​ సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జర్నలిస్టులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి, మంత్రి శ్రీనివాస్​గౌడ్​, హీరో నిఖిల్​, హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​లు ముఖ్య అతిథులు హాజరయ్యారు.

new-year-celebration-in-hyderabad-press-club
ప్రెస్​క్లబ్​లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

By

Published : Jan 1, 2020, 5:45 AM IST

Updated : Jan 1, 2020, 7:38 AM IST

నూతన సంవత్సర వేడుకలను జర్నలిస్టు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, కథానాయకుడు నిఖిల్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జర్నలిస్టు కుటుంబాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

జర్నలిస్టు పడే కష్టం విలువను లెక్కగట్టలేమని.. సమాజం కోసం అహర్నిశలు పాటుపడే జర్నలిస్టు మిత్రుల సేవలు ఎంతో విలువైనవని వక్తలు అభిప్రాయపడ్డారు. జర్నలిస్టు కుటుంబాలను ఈ సందర్భంగా ఒక దగ్గర కలుసుకోవటం సంతోషంగా ఉందని పేర్కొంటూ వారి పిల్లలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

ప్రెస్​క్లబ్​లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

ఇదీ చూడండి: పోలీసులు స్ట్రిక్ట్.. ఈసారి తగ్గిన ఈవెంట్ల జోష్​...

Last Updated : Jan 1, 2020, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details