తెలంగాణ

telangana

ETV Bharat / state

'న్యూ ఇయర్​ ఎంజాయ్​ చేయండి - పరిమితులు దాటొద్దు' - New Year 2024

New Year 2024 Rules in Hyderabad : న్యూ ఇయర్​ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు 31ఫస్ట్​ నైట్​ ఏం చెయ్యాలానని తెగ ప్లాన్​ చేస్తారు. అయితే పోలీసులు కూడా వేడుకలకు ప్రణాళికలు వేశారు. అవి ఏమిటో అనుకుంటున్నారా పరిమితులు ఎవరైనా మీరితే వారిపై తక్షణమే చర్యలు తీసుకునేలా. కొత్త సంవత్సరం వేడుకలు ఎంజాయ్​ చేసే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Police Rules on New Year in Hyderabad
New Year 2024 Rules in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 8:31 PM IST

న్యూ ఇయర్​ ఎంజాయ్​ చేయండి- కాని పరిమితులు దాటవద్దు

New Year 2024 Rules in Hyderabad: ఈ ఏడాది వేడుకల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా వేడుకలను జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వేడుకల వేళ హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని పోలీసులు తెలుపుతున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ సహా నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మహిళా భద్రత కోసం ప్రత్యేక షీ-టీమ్స్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Police Rules on New Year in Hyderabad : నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు, తదితర విషయాల్లో ఇబ్బందులు తప్పవని యువతకు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో షీ-టీమ్స్‌ మఫ్టీలో గస్తీ(She Teams on New Year Celebrations) నిర్వహిస్తారని తెలిపారు. అతివల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టిస్తామని అన్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసినా, మద్యం తాగి వాహనం నడిపినా ఉపేక్షించబోమని పోలీసులు వెల్లడించారు.

న్యూ ఇయర్ రోజు పార్టీ చేసుకుంటున్నారా​ - అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

"న్యూ ఇయర్​ కోసం కొన్ని హోటల్​కు అనుమతులతో పాటు కొన్ని నిబంధనలు ఇచ్చాం. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ఓఆర్​ఆర్​పై ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున మూసివేేస్తున్నాం. కొత్త సంవత్సర వేడుకలతో పాటు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నిబంధనలు అతిక్రమించకుండా న్యూఇయర్​ను ఎంజాయ్​ చేయాలి."- సుధీర్‌బాబు, రాచకొండ సీపీ

Cyberabad CP Avinash Mahanthi on New Year Rules : కొత్తసంవత్సర వేడుకల వేళ నగరవ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజిబుల్‌ పోలీసింగ్‌, సత్వర స్పందన, సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. రాత్రిపూట ఫ్లైఓవర్లు, తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వివరించారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలని సీపీ కోరారు. రోడ్లపై మద్యం తాగి నడపడం(Drunk and Drive Checking in Hyderabad), స్టంట్స్​ వేయడం లాంటివి చేస్తూ కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలు చేసుకుని అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

న్యూ ఇయర్​కు కౌంట్ డౌన్ షురూ - నయాసాల్ జోష్​లో భాగ్యనగరం

DCP Vijay Kumar on New Year 2024: పోలీసులు సూచించిన నియమాలు పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకల(New Year Celebrations in Hyderabad)కు ఏర్పాట్లు చేసుకోవాలని పబ్బులు, క్లబ్‌ నిర్వాహకులకు వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. పార్కింగ్‌ ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం సేవించిన వారు వాహనం నడపకుండా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా బాధ్యతాయుతంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కళ్లు చెదిరే సెలబ్రేషన్స్​తో 2024కు స్వాగతం- ఈ ఫొటోలు చూస్తే ఔరా అనాల్సిందే!

న్యూ ఇయర్ వేళ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు - 10 తర్వాత ఈ రూట్లలో నో ఎంట్రీ

ABOUT THE AUTHOR

...view details