ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. కొత్తగా 12వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 98,048 శాంపిల్స్ పరీక్షించగా 12,768మంది కరోనా బారినపడ్డారు. వైరస్ బారి నుంచి 15,612 మంది కోలుకున్నారు. ఫలితంగా మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,62,229లకు చేరింది.
AP Corona Cases: ఏపీలో కొత్తగా 12,768 కేసులు నమోదు - ఏపీలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 12,768మంది కరోనా బారినపడ్డారు.
గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ 98 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరులో 15మంది చనిపోగా, నెల్లూరు, 10, పశ్చిమగోదావరి 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, విజయనగరం 8, గుంటూరు 7, ప్రకాశం 7, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 6, కృష్ణా 5, వైఎస్‌ఆర్ కడప 4, కర్నూలులో నలుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మొత్తం 11,132మంది కన్నుమూశారు. ఇప్పటివరకూ 17,17,156మంది కరోనా బారిన పడగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,795 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి:high court: మెడపై కత్తి పెట్టి డబ్బులిప్పించాలి.. తల నరికేస్తే ఏం లాభం?: