తెలంగాణ

telangana

ETV Bharat / state

అభాగ్యులకు అండగా... స్వచ్ఛంద సంస్థ - తెలంగాణ న్యూస్ అప్​డేట్స్

కరోనా మహమ్మారి మొదటి దశ నుంచి పేదప్రజలు, అభాగ్యులకు తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్న వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 8మంది నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సమాజాన్ని గతేడాదిగా పట్టి పీడిస్తున్న కరోనా వల్ల వేలాది మంది అభాగ్యులకు తినడానికి తిండి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

new life foundation
new life foundation

By

Published : May 14, 2021, 7:33 AM IST

Updated : May 14, 2021, 10:05 AM IST

హైదరాబాద్, సికింద్రాబాద్​లోని రైల్వేస్టేషన్లు, బాగ్​లింగంపల్లి, సచివాలయం తదితర ప్రాంతాల ఫుట్​పాత్​లపై ఉంటూ... జీవనం సాగించే అభాగ్యులకు నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని న్యూలైఫ్​ ఫౌండేషన్​ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్​లోని బాగ్​లింగంపల్లి, వనస్థలిపురం, పాతబస్తీ, అత్తాపూర్​, రాంపల్లి, సికింద్రాబాద్​ ప్రాంతాలకు చెందిన 8మంది వ్యక్తులు వివిధ ఉద్యోగాలు చేస్తూ.. సమాజ సేవ చేయాలని సంకల్పించారు. గతేడాది కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన నాటి నుంచి.. అభాగ్యులను ఆదుకోవాలని సంకల్పంతో ఈ బృందం ముందుకు సాగుతోంది.

నాటి నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో దాదాపు 500 మందికి బాగ్​లింగంపల్లి, నాంపల్లి రైల్వేస్టేషన్​, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లోని అభాగ్యులకు పులిహోర, పెరుగన్నం ఇతర ఆహార పదార్థాలను ఆ సంస్థ అందిస్తోంది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ద్విచక్రవాహనంపై వచ్చి ఆ అభాగ్యులకు ఆహార పొట్లాలను అందజేసి వెళ్లడం అందరినీ ఆనందానికి గురిచేసింది.

కరోనా రెండవ దశ సమయంలో కూడా అన్నదాన కార్యక్రమంతో పాటు కరోనా బాధితులకు నెలవారి నిత్యావసర సరుకులు పౌండేషన్ ప్రతినిధులు అందచేసింది. అదేవిధంగా అవసరమైనవారికి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఆరు లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందజేశారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ వద్ద ఉన్న న్యూ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆహార పొట్లాలను అందజేశారు.

ఇదీ చదవండి: చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు

Last Updated : May 14, 2021, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details