వ్యవసాయ రంగంలో రైతులు వినియోగిస్తున్న డీజిల్ ట్రాక్టర్లకు ప్రత్యామ్నాయంగా ఈ-మొబిలిటీ ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చింది. కేవలం విద్యుత్ ఛార్జీ తప్ప మరే ఇతర ఖర్చు లేకుండా పూర్తిగా బ్యాటరీ సాయంతో ఈ గ్రీన్‌మొబిలిటీ ట్రాక్టర్‌ను రైతులు వినియోగించుకోవచ్చు. ఇంటా బయటా బహుళ ప్రయోజనాలు గల పర్యావరణహిత, కాలుష్య రహిత ట్రాక్టర్‌ను "సెల్‌ఈస్టైల్ ఈ-మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ" హైదరాబాద్‌లో లాంఛనంగా విడుదల చేసింది. ఈ ట్రాక్టర్ సాయంతో దుక్కిదున్నడం, విత్తనాలు విత్తడం, రసాయనాలు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడానికే కాకుండా పనులకు కూడా వినియోగించుకోవచ్చని ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొంటున్నారు.
తక్కువ ధరే..
21 హెచ్‌పీ సామర్థ్యం గల బ్యాటరీతో పనిచేసే ఈ ట్రాక్టర్ ఖరీదు రూ. 5 లక్షలుగా నిర్ణయించామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఒకసారి విద్యుత్ లేదా సౌరశక్తితో రీఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుందని ప్రకటించింది.