రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా క్రియాశీల కేసులు భారీగా పెరుగుతున్నాయి. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో కేవలం 1907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి వాటి సంఖ్య 4,678కి పెరిగాయి. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి క్రియాశీల కేసులే నిదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 463 మంది మహమ్మారి బారిన పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 307,205కి చేరింది. తాజాగా 364 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 300,833 మంది కోలుకున్నారు.
తాజాగా నలుగురు బలి
మరో నలుగురిని మహమ్మారి బలితీసుకోగా... మొత్తం మరణాలు 1694కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,678 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 1,723మంది ఐసోలేషన్లో ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 145 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న42,461 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.