'సరిలేరు నీకెవ్వరు' స్పూఫ్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారు. మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్ చెప్పి వావ్ అనిపించారు. ఇప్పుడు గబ్బర్‌సింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆ పిడుగులు.
పవర్ స్టార్ బర్త్‌డే సందర్భంగా... నెల్లూరు కుర్రాళ్ల గిఫ్ట్
ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు కుర్రాళ్లు మళ్లీ ఇరగదీశారు. సోషల్ మీడియాతో మరోసారి మన ముందుకొచ్చారు. ఇప్పటికే తమ టాలెంట్‌తో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను తమ వైపు చూసేలా చేసిన ... చిచ్చర పిడుగులు.. సోషల్ మీడియాను మరోసారి షేక్ చేయడానికి వచ్చారు. ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు.
పవర్ స్టార్ బర్త్‌డే సందర్భంగా... నెల్లూరు కుర్రాళ్ల గిఫ్ట్
సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని.. గబ్బర్‌సింగ్ స్పూఫ్ చేసి.. మళ్లీ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. ఆ సినిమాలో అందరినీ ఆకట్టుకున్న అంత్యక్షరి సీన్‌ను సెల్ఫోన్లో చిత్రీకరించి.. పవర్ స్టార్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు.
ఇదీ చదవండి:ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరవాలంటూ సుప్రీంలో వ్యాజ్యం