ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షతోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ సీఎంకు నెగెటివ్‌గా తేలింది. గత నెల 19న ముఖ్యమంత్రికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆ రోజు నుంచి సీఎం వైద్యుల పర్యవేక్షణలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
మధ్యలో ఒకసారి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో సీటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు చేయించుకున్నారు. ఏప్రిల్ 28న కేసీఆర్‌కు ర్యాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ రాగా.. ఆర్టీపీసీఆర్లో అందుకు భిన్నమైన ఫలితం వచ్చింది.