నీరా పాలసీ మార్గదర్శకాలను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ విడుదల చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా నీరా విధానాన్ని తీసుకొచ్చి... అందుకు సంబంధించిన జీవోను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తరుఫున హైదరాబాద్‌లో నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దశల వారిగా అన్ని జిల్లాల్లో నీరా ఉత్పత్తి, సరఫరాలను విస్తరిస్తామని మంత్రి వివరించారు. నీరాలో అనేక ఔషధ గుణాలున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారన్న మంత్రి... నగరంలో నీరా అమ్మకాలకు అనుమతివ్వటంపై గౌడ కులస్థుల తరఫున కృతజ్ఞతలు చెప్పారు. నీరా లైసెన్స్‌లు గౌడ కులస్థులకు మాత్రమే ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఇక నుంచి రాష్ట్రంలో 'నీరా' దుకాణాలు... - NEERA POLICY IN TELANGANA
రాష్ట్రంలో ఇక నుంచి నీరా దుకాణాలు మొదలవనున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా నీరా పాలసీని రాష్ట్రమంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్‌గౌడ్ విడుదల చేశారు. నగరంలోనూ తొందర్లోనే నీరా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు తెలిపారు.
NEERA POLICY GO RELEASED IN TELANGANA STATE
TAGGED:
NEERA POLICY IN TELANGANA