NCP leader Abhay Kailasrao Chiktagonkar joined in BRS Party: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ కేసీఆర్... పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ రోజురోజుకూ పుంజు కొంటున్నది. ఇప్పటికే కంధార్ లోహాలో బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం అయింది. అక్కడి సభకు వేలాది మంది హాజరైన సంగతి తెలిసిందే. ఇక గులాబీ పార్టీలో చేరికల జోరు కొనసాగుతున్నదనే చెప్పాలి. ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు బీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేల సంఖ్యలో పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎన్సీపీ నేత అభయ్ కైలాస్ రావ్ చిక్టగోంకర్ చేరారు.
KCR Focus on elections ప్రగతి భవన్‌లో అభయ్ కైలాస్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఔరంగాబాద్‌కు చెందిన అభయ్ కైలాస్‌ది రాజకీయ కుటుంబం కాగా... అభయ్ కైలాస్ తండ్రి, తాత గతంలో ఎమ్మెల్యేలుగా పని చేశారు. ఆయన మామ మాజీ ఎమ్మెల్యే కాగా... అత్త మాజీ జడ్పీ ప్రెసిడెంట్. 1998లో ఎన్ఎస్‌యూఐ ఔరంగాబాద్ విభాగానికి అభయ్ అధ్యక్షుడిగా పని చేశారు. 2002-07 వరకు ఔరంగాబాద్ జడ్పీ ప్రెసిడెంట్‌గా సేవలందించారు.