తెలంగాణ

telangana

ETV Bharat / state

బైసన్ పోలో గ్రౌండ్​లో ఎన్​సీసీ విద్యార్థుల యోగా

యోగా అనేది సంవత్సరంలో ఒకసారి మాత్రమే కాకుండా... తమ జీవితంలో ఒక భాగమయ్యేలా అలవాటు చేసుకోవాలని తెలుగు రాష్ట్రాల ఎన్​సీసీ కమాండర్ ఎం.ఎన్.​రెడ్డి సూచించారు.

యోగ చేసిన ఎన్​సీసీ విద్యార్థులు

By

Published : Jun 21, 2019, 9:21 AM IST

ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్​లోని బైసన్ పోలో గ్రౌండ్​లో ఎన్​సీసీ విద్యార్థులతో ప్రత్యేక యోగ శిక్షణ కార్యక్రమం చేపట్టారు. యోగా మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఎన్​సీసీ కమాండర్ ఎం.ఎన్.​రెడ్డి అన్నారు. ఇషా ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాలో మెళకువలను, సరికొత్త ఆసనాలను తెలియజేశారు. చిన్న వయసులోనే యోగా శిక్షణ మొదలు పెడితే వారికి భవిష్యత్తులో అది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు సూచించారు.

యోగ చేసిన ఎన్​సీసీ విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details