ఇవీ చూడండి:13న విచారణకు హాజరు కావాల్సిందే...!
బినామీ భూమిని అమ్మేందుకు కట్ర:
ఇవీ చూడండి:13న విచారణకు హాజరు కావాల్సిందే...!
బినామీ భూమిని అమ్మేందుకు కట్ర:
నయీం అనుచరుడు పాశం శ్రీనుపై ఇప్పటికే చాలా కేసులున్నాయి. నయీం భార్య హసీనా బేగం కూడా పీడీ యాక్టు కింద జైలు శిక్ష అనుభవించి బయటకి వచ్చారు. భువనగరిలోని సర్వే నెంబర్ 730 లోని 5 ఎకరాల భూమి గతంలో నయీం... అతని అనుచరుడు తుమ్మ శ్రీనివాస్‌పై రిజిస్ట్రేషన్ చేశాడు. ప్రస్తుతం ఆ భూమిని డీవీఆర్ ఎస్టేట్‌కు చెందిన మండపల్లి వెంకటేశ్వర్ రావుకు విక్రయించేలా ఒప్పందం జరిగింది. తమ్మ శ్రీనివాస్... భూమిని వెంకటేశ్వర్ రావు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు నయీం గ్యాంగ్ ఏర్పాట్లు చేసుకుంది. తిరిగి ఆ భూమిని మోక్ష డెవలపర్స్ సంస్థకు విక్రయించేలా వెంకటేశ్వర్ రావు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
రూ. 5 కోట్లకు నిర్ణయం:
నయీమ్ భార్య హసీనా బేగం మొదట భూమిని రూ. 5 కోట్లుగా నిర్ణయించినప్పటికీ వివాదాస్పదమైన భూమి కావడంతో రూ.89 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చిన డబ్బులో వాటాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. భూమికి సంబంధించిన జిరాక్స్ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయాలని భువనగిరి సబ్ రిజిస్ట్రార్‌ను కోరారు. నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు అంగీకరించడం వల్ల సబ్ రిజిస్ట్రార్ సహాదేవ్ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా ఇంకా ఏమైనా దందాలకు పాల్పడిందా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.