తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడు బంగారు తిరుచ్చి ఉత్సవం - తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు 2020

నేటి నుంచి పూర్తి స్థాయిలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవాళ్టి నుంచి వాహనసేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఇవాళ ఉదయం 9గం. నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే వేడుకలను ఈసారి కొవిడ్​తో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

navaratri-brahmotsavam-at-tirumala-begins-from-today
తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడు బంగారు తిరుచ్చి ఉత్సవం

By

Published : Oct 16, 2020, 8:25 AM IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గురువారం తితిదే శ్రీకారం చుట్టింది. సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలను ప్రారంభించింది. నేటి నుంచి పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేన ఉత్సవాన్ని నిర్వహించారు. ఇవాళ్టి నుంచి వాహనసేవలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే వేడుకలను ఈసారి కొవిడ్​తో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

నేడు బంగారు తిరుచ్చి ఉత్సవం...

బ్రహ్మోత్సవాల్లో ఇవాళ ఉదయం 9గం. నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. తిరుమల క్షేత్రాన్ని విద్యుద్దీపాలు, పూల తోరణాలతో అలకరించారు. దాదాపు ఆరు టన్నుల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

ఇదీ చదవండి

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ABOUT THE AUTHOR

...view details