మోదీ ప్రభుత్వం ఎఫ్‌డీఐలకు అనుమతిచ్చి పబ్లిక్ సెక్టార్ కంపెనీలను చంపేస్తుందని ఐఎన్‌టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు జనక్ ప్రసాద్ ఆరోపించారు. ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 24న దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్లు చెప్పారు. లక్షలాది చిన్న పరిశ్రమలు మూతపడతాయని.. 20 కోట్లమంది నిరుద్యోగులవుతారని వివరించారు. థర్మల్ విద్యుత్ అంతా పారిశ్రామిక వేత్తల చేతిల్లోకి వెళ్తే వ్యవసాయానికి కరెంట్ రాదన్నారు. ప్రైవేటు విద్యుత్ కంపెనీల చేతుల్లో దేశం అల్లాడిపోతుందని పేర్కొన్నారు. ఈ విషయాలపై ప్రధాని మోదీతోపాటు అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసినట్లు తెలిపారు.
24 నుంచి దేశవ్యాప్త సమ్మె: ఐఎన్‌టీయూసీ - 24 నుంచి దేశవ్యాప్త
కోల్ ఇండస్ట్రీలో వందశాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 24న దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్లు ఐఎన్‌టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు జనక్ ప్రసాద్ వెల్లడించారు. ఈ సమ్మెను కార్మికులంతా కలిసి విజయవంతం చేయాలని కోరారు.
24 నుంచి దేశవ్యాప్త సమ్మె: ఐఎన్‌టీయూసీ