వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సెప్టెంబరు 5న దేవవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు అఖిల భారత కిసాన్‌సభ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్ ముల్ల తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఎంబీ భవన్‌లో రెండు రోజులుగా జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావంతో వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయినప్పుడు రైతులకు పరిహారం చెల్లింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండిచేయి చూపడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
'వ్యవసాయరంగ సమస్యలపై దేశవ్యాప్త నిరసన' - వ్యవసాయ రంగం
వ్యవసాయ రంగంలో రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సెప్టెంబరు 5న దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు ఏఐకేస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్ ముల్ల తెలిపారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం సమావేశాల్లో ముఖ్య అతిథిగా హజరయ్యారు.
తెలంగాణలో వర్షాభావం, కరవు, సంస్థాగత రుణాలు, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ తదితర పథకాలు అమలు లోపభూయిష్టంపై సమావేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2014, 2019 ఎన్నికల్లో నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని హన్నన్ ముల్ల ఆక్షేపించారు. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల నుంచి గట్టెక్కించాలంటే స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించి అమలుచేయాలని హన్నన్ ముల్ల డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రైతు ఉద్యమాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సహాయ కార్యదర్శి విజ్జు కృష్ణన్, తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి తీగల సాగర్, వివిధ జిల్లాల నుంచి రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.