తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఉస్మోకన్ 2019" జాతీయ సదస్సు ప్రారంభం

హైదరాబాద్​లో "ఉస్మోకన్ 2019" జాతీయ సదస్సును ఉస్మానియా వైద్య కళాశాలలో నిర్వహించారు. మూడు రోజులు జరిగే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా  1850 మంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. వైద్యరంగంలో వస్తోన్న మార్పుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

"ఉస్మోకన్ 2019" జాతీయ సదస్సు ప్రారంభం

By

Published : Aug 8, 2019, 11:11 PM IST

"ఉస్మోకన్ 2019" పేరిట ఉస్మానియా వైద్య కళాశాల, నియో గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో 10వ జాతీయ సదస్సును నిర్వహించారు. వైద్య రంగంలో వస్తోన్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా వైద్య విద్యార్థులు పరిణితి చెందాలని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మోలేక్యులర్ బయాలజీ ( సీసీఎంబీ) డైరెక్టర్ డా.రాకేష్ మిశ్రా అన్నారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 1850 మంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. వైద్యులు రోగులతో ఏవిధంగా వ్యవహరించాలి, మెరుగుపరుచుకోవాల్సిన వైద్య విధానాలు, వైద్యులపై జరుగుతున్న దాడులను ఏవిధంగా నివారించాలి అనే అంశాలపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మూడు రోజులు జరిగే ఈ సదస్సులో విద్యార్థులు తమ అనుమానాలు నివృత్తం చేసుకోవచ్చని నియో గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ఎండీ దివ్య సునీత రాజ్ తెలిపారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తరువాత స్పెషాలిటీ విభాగాల్లో రాణించేందుకు వర్కుషాప్ ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ డా.సౌమ్య స్వామినాథన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సదస్సులో వివిధ విభాగాల్లో పాల్గొని తమ విజ్ఞనాన్ని ప్రదర్శించిన ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసి నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపారు. సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్​లో నూతన వైద్య పరికరాల ప్రత్యేకతలు, పనితీరును విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.

"ఉస్మోకన్ 2019" జాతీయ సదస్సు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details