జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ మారేడ్పల్లి పద్మశాలి మండపంలో తెలంగాణ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఖాదీ ఫర్ నేషన్... ఖాదీ ఫర్ ఫ్యాషన్ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. అగ్గిపెట్టెలో పట్టుచీరను ఇమిడే విధంగా చీరను తయారు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని వెల్లడించారు. చేనేత కార్మికుల వస్త్రాలను కొనుగోలు చేసి వారికి చేయూతనివ్వాలని... వారికి అండగా నిలవాలని కోరారు.
ఖాదీ ఫర్ నేషన్... ఖాదీ ఫర్ ఫ్యాషన్ - ఖాదీ ఫర్ నేషన్... ఖాదీ ఫర్ ఫ్యాషన్
మనుషుల మానాన్ని కాపాడే వస్త్రాన్ని తయారుచేసే చేనేత కార్మికుల పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో దయనీయంగా ఉందని పద్మశాలి యువజన సంఘం నేతలు వెల్లడించారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్లో నేతన్నల సమస్యలపై చర్చించారు.
Breaking News