మూసీనది ప్రక్షాళనపై దాఖలైన పిటిషన్ను జాతీయ హరిత ట్రైబ్యూనల్ సోమవారం విచారించనుంది. పారిశ్రామిక, గృహా వ్యర్థాల కలయిక, నాలాల ఆక్రమణలతో మూసీ నది కాలుష్యం అవుతోందని మహ్మద్ నయీ పాషా సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్పై ఎన్జీటీ.. కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని గత విచారణలో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఆదేశించింది. సీపీసీబీ, రాష్ట్ర పీసీబీలు సమర్పించిన నివేదికను పరిశీలించి సోమవారం మూసీ నది కాలుష్య అంశంపై ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
మూసీ ప్రక్షాళన పిటిషనపై సోమవారం విచారణ - హైదరాబాద్ తాజా వార్తలు
మూసీ నది ప్రక్షాళనపై దాఖలైన పిటిషన్పై సోమవారం జాతీయ హరిత ట్రైబ్యూనల్ విచారించనుంది. సీపీసీబీ, రాష్ట్ర పీసీబీలు సమర్పించిన నివేదికను పరిశీలించి మూసీ నది కాలుష్య అంశంపై ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
మూసీ ప్రక్షాళన పిటిషనపై సోమవారం విచారణ