తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2020, 1:55 PM IST

ETV Bharat / state

సచివాలయం కూల్చివేతపై ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ

సచివాలయం కూల్చివేత అంశం జోలికి వెళ్లబోమని జాతీయ హరిత ట్రైబ్యునల్​ వెల్లడించింది. కానీ పర్యావరణ కాలుష్యం, వ్యర్థాల నిర్వహణను అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.

national-green-tribunal-on-telangana-secretariat-demolition
సచివాలయం కూల్చివేతపై ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ

సచివాలయం కూల్చివేతపై విచారణను ఎన్​జీటీ సెప్టెంబర్‌ 25కి వాయిదా వేసింది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయాన్ని నేలమట్టం చేస్తున్నారంటూ... కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషన్‌ను విచారించిన ఎన్​జీటీ... సచివాలయం కూల్చివేత అంశం జోలికి వెళ్లబోమని స్పష్టచేసింది. ఇప్పటికే ఆ విషయంపై హైకోర్టు ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. కూల్చివేతతో పర్యావరణ కాలుష్యం... వ్యర్థాల నిర్వహణను అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర పర్యావరణ శాఖ... సీపీసీబీ, రాష్ట్ర పీసీబీ, ఐఐటీ హైదరాబాద్ నిపుణులతో కమిటీ వేస్తున్నట్లు పేర్కొని... రెండునెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:డిశ్ఛార్జి తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి!

ABOUT THE AUTHOR

...view details