కేంద్ర మాజీమంత్రి సుష్మాస్వరాజ్ మృతిపట్ల భాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. సమస్యలను లోతుగా ఆలోచించి పరిష్కారం చూపిన గొప్ప నాయకురాలని పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్ ఆదర్శ మహిళగా... భారతీయ సంస్కృతికి ప్రతీక అని తెలిపారు. వాజ్‌పేయి, అడ్వాణీతో పాటు పార్టీ అభ్యున్నతికి పాటుపడిన గొప్పనేత అని చెప్పారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని పార్లమెంట్ లోపల, బయట తన గళమెత్తి... ప్రత్యేక రాష్ట్రం సాధించేవరకు వెన్నుదాన్నుగా నిలిచారని గుర్తుచేశారు.
'తెలంగాణకు వెన్నుదన్నుగా నిలిచిన వీరనారి' - సుష్మాస్వరాజ్
కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపట్ల భాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. ఆమె మరణం భాజపాకు తీరని లోటన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమె చేసిన కృషి మరువలేదని తెలిపారు.
sushma swaraj
గల్ఫ్ దేశాల్లో తెలుగువారు ఇబ్బందులకు గురైతే వెంటనే స్పందించి... ఆయా దేశాల మంత్రులతో చర్చించి సమస్యలను పరిష్కరించేవారని తెలిపారు. సుష్మాస్వరాజ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ట్విట్టర్ మాధ్యమం ద్వారా అందరికీ అందుబాటులో ఉండి.... సమస్యలపై వెంటనే స్పందించిన గొప్ప నాయకురాలు అని కొనియడారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవీ చూడండి:తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'