తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ పథకాలు భేష్'

తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఉందన్నారు నేషనల్​ డిఫెన్స్​ కాలేజీ ఫ్యాకల్టీ బృంద సభ్యులు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. 5 రోజుల పర్యటనలో వారు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.

సీఎస్​

By

Published : Mar 6, 2019, 4:20 PM IST

డిఫెన్స్​ కాలేజీ బృంద సభ్యులకు తెలంగాణ పథకాలు వివరిస్తున్న సీఎస్​
నేషనల్​ డిఫెన్స్​ కాలేజీకి చెందిన 16 మంది సభ్యుల బృందం ఎకనమిక్​ స్టడీలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​.కె.జోషిని కలిసింది. గత నాలుగున్నరేళ్లుగా తెలంగాణ సాధించిన అభివృద్ధిని సీఎస్​ వారికి వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఫార్మా, రక్షణ​, ఐటీ రంగాల్లో అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

తెలంగాణ అద్భుత ప్రగతి

తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని నేషనల్​ డిఫెన్స్​ కాలేజ్​ ఫ్యాకల్టీ ఇంఛార్జీ అభయ్​ త్రిపాఠి కొనియాడారు. పర్యటనలో టీహబ్, టాటా బోయింగ్ ఏరోస్పేస్, జెన్ టెక్నాలజీస్, హనీవెల్ టెక్నాలజీస్​ ను సందర్శించనున్నట్లు బృంద సభ్యులు పేర్కొన్నారు. ఈనెల 4 నుంచి 8 వరకు రాష్ట్రంలో బృందం పర్యటిస్తుంది.

ఇవీ చూడండి :నిజామాబాద్​లో అమిత్​ షా

ABOUT THE AUTHOR

...view details