తెలంగాణ

telangana

ETV Bharat / state

టీడీపీ అధికారంలోకి రాగానే డీజిల్, పెట్రోల్‌ ధరలు తగ్గిస్తాం: నారా లోకేశ్‌

Nara Lokesh Yuvagalam Padayatra: ఏపీలో చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కొత్తూరు నుంచి ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. టిటి కండ్రిగ సమీపంలో ఆటో డ్రైవర్‌తో మాట్లాడిన లోకేశ్‌.. డీజిల్‌ ధరల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే డీజిల్, పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీల సమస్యలు పరిష్కరించి గుర్తింపు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

Nara Lokesh
Nara Lokesh

By

Published : Feb 12, 2023, 9:13 PM IST

Nara Lokesh Yuvagalam Padayatra: ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ 17వ రోజు చేపట్టిన పాదయాత్ర కొత్తూరు విడిది కేంద్రం నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా అడుగడుగునా అందరినీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మహిళలు హరతులిచ్చి.. టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టిటి కండ్రిగ గ్రామం సమీపంలో ఆటో డ్రైవర్ శివకుమార్​ని లోకేశ్‍ పలకరించారు.

డీజిల్ రేటు ఎంత అని లోకేశ్.. ఆటో డ్రైవర్ శివకుమార్​ అడగగా రూ.95 అని తెలిపారు. మాది సరిహద్దు గ్రామం అని.. ఆంధ్రప్రదేశ్​లో డీజిల్ రేటు ఎక్కువగా ఉందని.. అందుకే రోజు పక్కనే ఉన్న తమిళనాడు బోర్డర్ వెళ్లి డీజిల్ కొట్టిస్తా అంటూ లోకేశ్​కు సమాధానం చెప్పాడు. దీనిపై స్పందించిన ఆయన.. టీడీపీ అధికారంలోకి రాగానే డీజిల్, పెట్రోల్ పన్నులు తగ్గించి ధరలు తగ్గిస్తామని చెప్పారు. అప్పుడు బోర్డర్ దాటి పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం ఉండదని భరోసా ఇచ్చారు.

పాదయాత్రలో భాగంగా ఈడిగపల్లి గౌడ, ఆలత్తూరు మైనారిటీలను లోకేశ్‍ కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వారు వినతిపత్రం అందజేశారు. ప్రతి ఒక్కరికి గుర్తింపు కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. గీత కార్మికుల పట్ల టీడీపీ చిత్తశుద్ధితో ఉందని.. కల్లుగీత కార్మికులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని లోకేశ్ చెప్పారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై కక్షగట్టి హత్యలు చేయిస్తున్నాడని లోకేశ్ విమర్శించారు. 2019ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడని దుయ్యబట్టారు. మైనారిటీలపై అక్రమ కేసులు బనాయించే వైఎస్సార్​సీపీ సైకో పాలనను.. 2024లో గద్దె దించాలని లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:ఆ 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కనివ్వం: రేవంత్‌రెడ్డి

దేశంలో అతి పెద్ద జాతీయ ఎక్స్​ప్రెస్​ హైవే ప్రారంభం.. అభివృద్ధికి నిదర్శనమన్న మోదీ

ABOUT THE AUTHOR

...view details