తెలంగాణ

telangana

By

Published : Oct 5, 2020, 3:26 PM IST

ETV Bharat / state

అతను వేసే బొమ్మలకు కుంచె అవసరంలేదు... గోళ్లు చాలు

కళకు అనేక రూపాలున్నాయి. డ్రాయింగ్, పెయింటింగ్, సాండ్ ఆర్ట్ ఇలా భిన్నరూపాల్లో ఉండే కళలు అందరికీ సుపరిచితమే. కానీ.. నెయిల్ ఆర్ట్ గురించి విన్నారా. అంటే గోళ్లతో గీసే కళారూపాలు. పదునైన నఖములతో.. సున్నితమైన పేపర్​పై ఆర్ట్ వేయడం ఎప్పుడైనా చూశారా? హైదరాబాద్​కు చెందిన నరసింహాచారి గోళ్లతో బొమ్మలు వేస్తూ... ఔరా అనిపిస్తున్నారు.

nakha-chitra-artist-in-amberpet-at-hyderabad
అతను వేసే బొమ్మలకు కుంచె అవసరంలేదు... గోళ్లు చాలు

కొందరు గోళ్లను అందం కోసం పెంచుకుంటుంటే... హైదరాబాద్​లోని అంబర్​పేటకు చెందిన నరసింహాచారి మాత్రం ఆర్ట్ వేయటానికి పెంచుకుంటున్నారు. తన పదునైన గోళ్లతో... చేతిలోనే ఇమిడిపోయే పేపర్​పై నిముషాల వ్యవధిలోనే అబ్బురపరిచే బొమ్మలు గీస్తూ.. ఔరా అనిపిస్తున్నారు. కాదేది కళకు అనర్హమని నిరూపిస్తున్నారు.

అతను వేసే బొమ్మలకు కుంచె అవసరంలేదు... గోళ్లు చాలు

తన ఉపాధ్యాయుడు నుంచి ఈ ఆర్ట్ నేర్చుకున్నట్లు నరసింహ తెలిపారు. సరదాగా ప్రారంభమైన ఈ వ్యాపకం... ప్రముఖులు, దేవతామూర్తుల బొమ్మలు వేసేలా పరిణితి చెందినట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బొమ్మలు వేసి... వారికి కానుకగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

భిన్నరూపాల్లో...

ఆర్ట్ టీచర్​గా రాణించాలని ఫైన్​ఆర్ట్స్​లో కోర్సును సైతం పూర్తి చేశానని తెలిపారు. కానీ కుటుంబపోషణ దృష్ట్యా కార్పెంటర్​గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో సినిమాలకు ఆర్ట్​ డైరెక్టర్​గా పనిచేశానని నరసింహ పేర్కొన్నారు. తనలో ఆర్ట్​ ప్రతిబింబించేలా కిటికీలు, ఎంట్రెన్స్ గేట్లలో భిన్నరూపాలు సృష్టిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

పాఠశాల విద్యార్థులు, స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారు తనతో నెయిల్ ఆర్ట్ వేయించుకుంటారని.. వారి శుభకార్యాలు, ప్రత్యేక రోజుల్లో గిఫ్ట్​గా ఇచ్చుకుంటారని నరసింహ సంతోషం వ్యక్తం చేశారు. తన నఖ చిత్రాలన్నింటినీ కలిపి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్​లో ప్రదర్శించడమే తన అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఆ 11 కుటుంబాల కోసం 11 గంటలు నడిచి వెళ్లిన సీఎం..

ABOUT THE AUTHOR

...view details