తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడ గణేశ్ ఉత్సవాలు ముస్లిం యువకుడే చేస్తాడు! - muslim young man celebrating ganesh festival from ten years

పూలతోటలో ఎన్నో రకాల రంగుల పువ్వులున్నట్లు... అనేక మతాల, సంస్కృతుల సమ్మేళనమే భారతదేశం. మన మతాన్ని పూజిద్దాం... పర మతాన్ని గౌరవిద్దాం అనే సంప్రదాయాన్ని ఆది కాలం నుంచే  ఆచరిస్తున్నారు పెద్దలు. వారి బాటలోనే నడుస్తున్నారు జూబ్లిహిల్స్​ నియోజకవర్గం రహమత్​నగర్​ డివిజన్ కార్మిక నగర్​ వాసులు. మతం ఏదైనా దైవ స్వరూపం ఒక్కటేనంటూ.. పదేళ్లుగా వినాయక చవితిని వైభవంగా జరుపుతున్నాడు ముస్లిం యువకుడు షేక్​ ఉమర్​.​

అక్కడ గణేశ్ ఉత్సవాలు ముస్లిం యువకుడే చేస్తాడు!

By

Published : Sep 10, 2019, 9:25 PM IST

వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా హిందువులు వాడవాడలా గణేష్​ వేడుకలు జరుపుకోవడం మనకు తెలిసిందే.. కానీ జూబ్లిహిల్స్​ నియోజకవర్గం రహమత్​నగర్​ డివిజన్​లోని కార్మికనగర్​లో మత సామరస్యానికి అద్దం పడుతూ గణేష్​ నవరాత్రులు నిర్వహిస్తారు. గణపతి వేడుకలను ఓ ముస్లిం యువకుడు దగ్గరుండి మరీ నిర్వహిస్తాడు. పూజలో, వేడుకల్లోను పాల్గొంటూ..అన్ని కార్యక్రమాలు అతనే పర్వవేక్షిస్తున్నాడు షేక్​ ఉమర్​.

కేబుల్​ వ్యాపారి అయిన ఉమర్​ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్​ యూత్​ ఫెడరేషన్​ తరఫున ఆటోస్టాండ్​లో గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. పదేళ్ల నుంచి వేడుకలు చేసే ఉమర్... ఇది తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నాడు. తమ బస్తీవాళ్లంతా ఏ మతస్తులైనా అన్ని పండుగలు కలిసే చేసుకుంటామని చెబుతున్నారు ఉమర్. అంతా కలిసి అన్నదమ్ముల్లా మతసామరస్యానికి జీవంపోస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ బస్తీవాసులు.

అక్కడ గణేశ్ ఉత్సవాలు ముస్లిం యువకుడే చేస్తాడు!

ఇదీ చూడండి: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details