తెలంగాణ

telangana

ETV Bharat / state

Fish market: జనంతో కిటకిటలాడిన ముషీరాబాద్​ చేపల మార్కెట్​ - తెలంగాణ తాజా వార్తలు

మృగశిరకార్తె తర్వాత చేపల క్రయవిక్రయాలు మునపటి కన్నా మెరుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు సమయాన్ని పెంచడంతో వ్యాపారం కొద్దికొద్దిగా ఊపందుకుంటోందని ముషీరాబాద్​ చేపల మార్కెట్ వ్యాపారులు తెలిపారు.

Musheerabad fish market
జనంతో కిటకిటలాడిన ముషీరాబాద్​ చేపల మార్కెట్​

By

Published : Jun 13, 2021, 10:23 PM IST

ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్ ముషీరాబాద్ చేపల మార్కెట్ జనంతో కిటకిట లాడింది. కరోనా రెండవ దశ విజృంభన నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడిందని వ్యాపారులు వాపోతున్నారు. కేవలం సెలవు రోజుల్లో మాత్రమే... వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతోందని అన్నారు.

ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు సమయాన్ని పెంచడంతో వ్యాపారం కొద్దికొద్దిగా ఊపందుకుంటోందన్నారు. కానీ అమ్మకాలు మాత్రం నామమాత్రంగా సాగుతున్నాయని తెలిపారు. చేపల ధరలు కూడా గతం కన్నా తక్కువకే అమ్మకాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు చేపల మార్కెట్లలో కొవిడ్​ నిబంధనలను పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీని కారణంగా వైరస్​ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: CM KCR: పల్లె, పట్టణ ప్రగతి అమలుకు అదనపు కలెక్టర్లకు నిధులు

ABOUT THE AUTHOR

...view details