తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి కోసం వాగ్వాదం..ఇంటి ఓనర్​పై హత్యాయత్నం.. - MURDER ATTEMPT

నీటి సమస్య యజమానిపై హత్యాయత్నానికి దారితీసింది. ట్యాంకర్లు తెప్పించుకుందామని అద్దెదారులను ఇంటి యజమాని కోరగా.. ఒకరు నిరాకరించారు. అద్దెదారును లాక్‌డౌన్‌ పూర్తయ్యాక ఇల్లు ఖాళీ చేయాలి అన్నందుకు.... కోపం పెంచుకుని యజమానిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

murder-attempt-at-golconda-ps-hyderabd
యజమానిపై హత్యాయత్నానికి దారితీసిన నీటి సమస్య

By

Published : May 16, 2020, 10:45 AM IST

Updated : May 16, 2020, 11:00 AM IST

నీళ్ల కోసం జరిగిన వాగ్వాదం... ఇంటి యజమానిపై హత్యాయత్నానికి దారితీసింది. హైదరాబాద్‌ గోల్కొండ పరిధిలోని కాలనీలో కొన్ని రోజులుగా నీళ్ల కొరత ఏర్పడింది. అందరం కలిసి ట్యాంకర్లు తెప్పించుకుందామని ఇంటి యజమాని అద్దెదారులను కోరాడు. ఆ భవనంలోని ఆరు కుటుంబాలు ఇందుకు ఒప్పుకోగా... ఒక అద్దెదారు నిరాకరించాడు. అభ్యంతరం తెలిపిన కుటుంబాన్ని లాక్‌డౌన్‌ ముగిశాక ఇల్లు ఖాళీ చేయాలని యజమాని చెప్పాడు. ఖాళీ చేయమన్నందుకు యజమానిపై కోపం పెంచుకున్న ఆ అద్దెదారు తన స్నేహితులతో కలిసి ఇంటి యజమాని, అతని కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : May 16, 2020, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details