తెలంగాణ

telangana

ETV Bharat / state

'వర్షాకాలంలోపు ముంపు ప్రాంతాలను గుర్తించాలి' - telangana latest nes

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్​ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​కుమార్​ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల వాటిల్లే ముంపు నివారణకై చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.

Municipal Department Chief Secretary Arvind Kumar Review Meeting with officials
'రానున్న వర్షాకాలంలోపు ముంపు ప్రాంతాలను గుర్తించాలి'

By

Published : Jan 4, 2021, 3:54 PM IST

ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను రానున్న వర్షాకాలంలోపు గుర్తించాలని మున్సిపల్​ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​కుమార్​ అధికారులను ఆదేశించారు. తక్షణ చర్యలు చేపట్టేందుకు జోన్​ల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

నగరంలోని అపార్టుమెంట్లలో సెల్లార్​ల నుంచి నీరు ఎత్తిపోయడానికి వీలుగా మోటార్ పంపులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల వాటిల్లే ముంపు నివారణకై చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి.. ముంపునకు కారణమయ్యే వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: కేటీఆర్​ను కలిసిన రాచకొండ సీపీ మహేశ్​ భగవత్

ABOUT THE AUTHOR

...view details