హైకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను, కార్మికులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వానికి విన్నవించింది. 15 సంవత్సరాకు పైగా జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముషీరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో దృశ్య మాధ్యమ సమావేశం జరిగింది.
'మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి'
మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను, కార్మికులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముషీరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో దృశ్య మాధ్యమ సమావేశం జరిగింది.
'మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి'
జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, ఆ లోపు సమాన పనికి - సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ 20న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయాలని సమావేశంలో తీర్మానించింది. 25 ఏళ్లుగా అరకొర వేతనాలతో పనిచేస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు.