సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సాగు చట్టాలను తెరాస వ్యతిరేకిస్తోందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు భారీ నష్టం జరుగుతుందని తెలిపారు.
వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: కేటీఆర్ - భారత్ బంద్ తాజా వార్తలు
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు భారీ నష్టం జరుగుతుందని చెప్పారు. నూతన చట్టంలో మద్దతు ధర అంశాన్ని ఎందుకు చేర్చలేదన్నారు.
వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: కేటీఆర్
నూతన చట్టంలో మద్దతు ధర అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరమన్నారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు వరంగా మారి రైతుల హక్కులు హరించే ప్రమాదం ఉందన్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్ముకునే అవకాశం ఉందని చెప్పారు. కొత్త చట్టాలతో రైతులతో పాటు వినియోగదారులకూ నష్టమేనని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:తెరాస ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యం: కేటీఆర్