తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉస్మానియా వసతిగృహంలో బురద నీరే తాగునీరు - UNIVERSITY OFFICIALS

ప్రఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కలుషిత నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి గృహంలోకి సరఫరా అయ్యే నీరు ఏమాత్రం తాగేలా లేదు. ఇప్పటికే పలువురు ఈ నీరు తాగి అనారోగ్యానికి గురయ్యారు.

స్వచ్ఛమైన తాగునీటి కోసం శాశ్వత పరిష్కారం చూపించాలి : విద్యార్థులు

By

Published : Mar 20, 2019, 11:28 PM IST

భగీరథ వసతి గృహంలో రెండు రోజులుగా కలుషిత నీరు సరఫరా చేస్తున్నారు
ఘనత వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తాగేందుకు మంచినీరు కరువైంది. క్యాంపస్​ పరిధిలోని భగీరథ వసతి గృహంలో రెండు రోజులుగా కలుషిత నీరు వస్తోంది.

కలుషిత నీటితో అనారోగ్యం

కలుషిత నీటితో విద్యార్థులు అనారోగ్య బారిన పడుతున్నారు. చేసేది లేక విద్యార్థులు దుకాణాల్లో మంచినీరు కొనుక్కుని తాగుతున్నారు.ఇకనైనా వర్శిటీ యంత్రాంగం స్పందించి స్వచ్ఛమైన తాగునీటి కోసం శాశ్వత పరిష్కారం చూపించాలని వారుకోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details