దిశకో న్యాయం... ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకో న్యాయమా అంటూ మందకృష్ణ మాదిగ మహాదీక్ష చేపట్టారు. వెనుకబడిన తరగతుల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను వ్యతిరేకిస్తూ ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో ఒక్కరోజు దీక్ష చేశారు. దిశ హత్య కేసులో నిందితులు బీసీ, మైనార్టీలు కాబట్టే చట్టవ్యతిరేకంగా కాల్చి చంపారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. అణగారిన వర్గాల మహిళలపై.... ఉన్నత వర్గాల వారు దాడి చేస్తే వారిని అదేవిధంగా శిక్షించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం లక్షలాదిమందితో ప్రదర్శన చేపట్టి దేశాన్నంతటినీ హైదరాబాద్కు రప్పించాలని పిలుపునిచ్చారు.
'మీకో న్యాయం... మాకో న్యాయమా'
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ... ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ మహాదీక్ష చేపట్టింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జేబీరాజు దీక్షకు మద్దతు తెలిపారు.
'మీకో న్యాయం... మాకో న్యాయమా'